అసలు వంట అంటే ఏమిటి??--1 #telugublogs #cooking #recipes@bananaleaf
చాలా మంది మిత్రుల నువు బాగా వంట చేస్తావు కదా, అదే పదిమందికి నేర్పించవచ్చుకదా? అన్నప్పుడు నిజమే అనిపించింది కానీ బోలెడన్ని కుకరీ చానెల్స్ ఎన్నో, ఎన్నో రకాల రెసిపీలు నేర్పించుతున్నాయి. నేనెం చెప్పను అని ఆలోచిస్తే అసలు వంట అంటే ఏమిటి, ఆ వంటని ఏ విధంగా వండాలి అనేదే అసలు విషయం అనిపించింది. ఎందుకంటే, అవే కూరగాయలు, అవే దినుసులు, అదే నూనె. అయినా మనిషి మనిషికీ వండాక రుచి మనిషికో తీరుగా వస్తుంది. ఇది ఎందుకంటే, వంటని సరిగా అర్థం చేసుకోకపోవడమే అనిపిస్తుంది. ప్రతీ దానికీ ఒక నిర్ధిష్టమైన విధానం ఉంటుంది. ఇది ఇంత వేగాలి. ఇది ఇంత మరగాలి. దాని తర్వాత ఫలానా దినుసు పడాలి. ఇలా ఓ సీక్వెన్స్ అన్నమాట. ప్రతీ రెసిపికీ ఒక బేసిక్ వండే విధానం ఉంటుంది. ఇది అర్థమైతే మన నలభీములు అన్నట్లు వంటేమయినా బ్రహ్మ విద్యా? ఎవరైనా రుచిగా అలా అలా వండేయగలరు!
వంట చేయడానికి ముందస్తుగా అదంటే ఇష్టం ఉండాలి! ఓ ఐటమ్ కి రుచి తెప్పించాలంటే ఏం చేయాలి అన్న తపన ఉండాలి! ఉప్పూ కారం మసాలాలతో చెడుగుడు ఆడుకోవడం తెలియాలి!! అంతేగానీ, వంట ఎవరి కోసమో వండాలి! నాకిది ఇష్టం లేదు, కానీ వండక తప్పడం లేదు! ఈ వంట బాధ ఎప్పుడు తప్పుతుందీ? ఇలా అనుకునేవాళ్ళు వంట జోలికి పోకపోవడమే మంచిది! ఎందుకంటే ఇలా అనాసక్తితో వండితే కూర అయితే తయారవుతుందిగానీ, దానికో కేరెక్టర్ గానీ, ఫలానా వారి రెసిపీ అన్న సిగ్నేచర్ గానీ ఉండదు! అందుచేత ఇదివంట అంటే ఇష్టం ఉన్నవాళ్ళకి మాత్రమే!
అది ఉన్నంతవరకూ ఇది ఓ నిరంతర తృష్ణ!
కలుద్దాం!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి